నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని తాజా మాజీ ఎంపీపీ పాండుగౌడ్, తాజా మాజీ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం యాదవ్, తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి పేర్కొన్నారు. జగదేవ్ పూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన దాడి రవికి రూ. 15, 500 సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కావడంతో శుక్రవారం ఆ చెక్కును అందజేసిన నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో దోహదపదుతుందని తెలిపారు.