సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంకు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామ కోటి రామరాజు గురువారం వినూత్నంగా తన కళను ప్రదర్శించారు. ఈరోజు వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని టీ పొడి (చాయ్ పత్తి)తో వాల్మీకి ముఖచిత్రాన్ని అద్భుతంగా వేసి తన భక్తి భావాన్ని చాటారు. ఆయన మాట్లాడుతూ, కులం కన్నా ధర్మం గొప్పదని వాల్మీకి చాటి చెప్పారని పేర్కొన్నారు.