యువత, విద్యార్థులు పొగాకుకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని మాతా శిశు కేంద్రంలో ఆదివారం పొగాకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు సేవించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పొగాకు నియంత్రణ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సేవిస్తే జరిమానా విధిస్తామన్నారు.