రైతుల పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో అధికారికంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఇంకా ఎవరికైనా రుణమాఫీ కాకుంటే వెంటనే చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.