ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత ఓటర్ జాబితను కొనసాగించాలి

59பார்த்தது
పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పాత ఓటర్ జాబితను కొనసాగించాలని న్యాయవాది హరీష్ కుమార్ డిమాండ్ చేశారు. సదాశివపేటలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఓటరుగా నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లు కొత్తగా నమోదు చేసుకోవాలని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. కొత్తవారికి మాత్రమే నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி