కంది మండల పరిధిలోని ఎర్థనూర్, బ్యాతోల్ బేగంపేట, చిద్రుప్ప గ్రామాల శివారులోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో రెవెన్యూ పోలీస్ అధికారులు ఇసుక ఫిల్టర్లను కూల్చివేశారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా కృత్రిమ ఇసుక తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ విజయలక్ష్మి హెచ్చరించారు. సంగారెడ్డి రూరల్ ఎస్సై వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.