సంగారెడ్డి మండలంలోని సమగ్ర కుటుంబ సర్వే వివరాలను శుక్రవారం నమోదు చేస్తున్నట్లు ఎంపీడీవో యాదగిరి ఓ ప్రకటనలో తెలిపారు. 11 పంచాయతీల వివరాలను నమోదు చేసేందుకు 22 మంది ఆపరేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. అన్ని వివరాలను పక్కాగా నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.