ప్రభుత్వం లంబాడాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు లంబాడాలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లంబాడాలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.