యువతను పొగాకుకు దూరంగా ఉంచాలని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పొగాకు సేవించడం వల్ల కలిగే అనర్ధాలపై 60 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పొగాకు రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.