సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని నూకల కుంట చెరువు కట్టు కాలువ ఆదివారం తెగిపోయింది. వారం రోజులగా కురుస్తున్న వర్షాలతో కట్ట తెగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఫసల్ వాదిలోని మల్లం చెరువుకు రావలసిన వర్షపునీరు సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువులోకి వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి కట్ట కాల్వను పూడ్చివేయాలని కోరుతున్నారు.