సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధి చెరువు అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. మంగళవారం అమీన్ పూర్ పెద్ద చెరువును సందర్శించారు. అక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అమీన్పూర్ పెద్ద చెరువు, శంభుని కుంట, పద్మావతి నగర్ కాలనీ, వెంకట రమణ కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ పర్యటించారు.