నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు గ్రామంలో శుక్రవారం ఐకెపి కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ
కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.