సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దామరగిద్దలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ అధికారులు శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక మాజీ సర్పంచి మనోహర్, మారుతి రావు, దత్తు రావు వడ్ల కాంటకు పూజలు చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీలు, సంత్ రైతులు శ్యామ్ రావు, జ్ఞానేశ్వర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు మహానంద ఉన్నారు.