మండలంలో నవంబర్ 6 నుంచి 18వ తేదీ వరకు జరిగే కులగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వట్పల్లి ఎంపీడీవో శశి ప్రభ అన్నారు. వట్పల్లి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎన్యుమరేటర్లకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని చెప్పారు. అనంతరం సర్వే సామాగ్రిని అందజేశారు.