పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. పుల్కల్ లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.