రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. రత్నూర్ మండలం చందాపూర్ పల్పనూరు, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ట్యాబ్ లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.