గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పించేలా కృషి చేయాలని డిఆర్డిఏ అదనపు పీడీ జంగారెడ్డి అన్నారు. ఆందోలులోని డిఆర్డిఏ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించడం వల్ల ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు కూడా వ్యాపారాలు చేసి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమావేశంలో ఉద్యోగులు పాల్గొన్నారు.