వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు (వీడియో)

1060பார்த்தது
ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం బట్టువారిపల్లి వద్ద వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. మంగళవారం భారీగా వర్షం కురవడంతో వాగు పొంగి పొర్లింది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఇవాళ మార్కాపురం నుంచి పొదిలి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుని ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు దిగి.. నీటిలో నడుచుకుంటూ బయటకు వచ్చారు. స్థానికులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చారు.

தொடர்புடைய செய்தி