యాదవుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని, నేడు యాదవులకు సంస్కృతి సంప్రదాయమైన సదర్ పండుగను ప్రభుత్వపరంగా అధికారికంగా జరుపుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానీదని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన యాదవుల సదర్ పండగ వేడుకల్లో ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.