మహిళలు ఆర్థిక ప్రగతిని సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని తద్వారా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణ పరిధిలోని ఎఫ్.సి.ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమానికీ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.