
షాద్ నగర్: శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్ నగర్ పట్టణ చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయంలో లోక కళ్యాణం కొరకై జరుపుతున్న శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవస్థాన కమిటీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులను సాధనంగా ఆహ్వానించి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దంపతులు, జగత్తుకే ఆది దేవతలైన శివ పార్వతుల కళ్యాణాన్ని దగ్గరుండి మరీ జరిపించారు.