తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కులగణన సర్వే చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 1. 17 కోట్లకు పైగా ఇళ్లను గుర్తించి మొదటి దశలో వాటికి స్టిక్కర్లు అంటించారు. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కులగణనలో వివరాలను నమోదు చేయించుకున్నారు. కవిత నివాసం ఉంటున్న హైదరాబాద్ లోని ఇంటికి కులగణన అధికారులు వచ్చారు. అధికారులకు సహకరించి కులగణనలో ఎమ్మెల్సీ కవిత వివరాలు నమోదు చేయించుకున్నారు.