రాష్ట్రంలో చెరువులు కబ్జాలకు గురైన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తున్నారు. తాజాగా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం హైడ్రా కమిషనర్ పర్యటించారు. అమీన్ పూర్ పెద్ద చెరువు, శంభునికుంట, పద్మావతి నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీల వాసుల ఫిర్యాదు మేరకు కమిషనర్ అమరీన్పూర్కు వచ్చారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రా పరంగా తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.