హైదరాబాద్ మూసీ సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరిసిన సవాల్‌కు తాను సిద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం తెలిపారు. మూసీ ప్రక్షాళన వ్యతిరేకించే బీఆర్ఎస్, బీజేపీ నేతలు మూడు నెలలపాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటే సుందరీకరణ అంశాన్ని పక్కనపెడతానని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాను రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.