బాలానగర్ టీం, సైబరాబాద్ ఎస్ ఓ టి బృందం డ్రగ్స్ విక్రయిస్తున్న సుమన్, రమావత్ లాలు, కేతావత్ విజయ్ కుమార్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారి నుంచి శుక్రవారం 2. 590 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరు ఒడిశా నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెళ్లడైనట్లు పేర్కొన్నారు. వారి నుంచి బైక్, మూడు మొబైల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు తెలిపారు.