రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో మంగళవారం గ్రూప్ 2కు సిద్ధమవుతున్న 120 మంది విద్యార్థులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏలుగంటి మధుసూదన్ రెడ్డికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నపించారు. ఛైర్మెన్ సానుకూలంగా స్పందించి రాత్రి సమయం 10-00 గంటల నుండి 12-00 వరకు , 2 గంటలు అదనంగా గ్రంథాలయం తెరిచి ఉంటుందని, గ్రూప్ 2కు సిద్ధమవుతున్న 120 మందివిద్యార్థుల కు 45 రోజుల వరకు భోజనం తన వ్యక్తిగత సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది.