పూడూర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పరిగి ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పూడూరు గేటు సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్ను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన స్థలాన్ని డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రహదారిపై సూచిక బోర్డులు, డివైడర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.