వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని లగచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. శిథిలావస్థకు చేరిన ఈ ప్రయాణికుల ప్రాంగణం పైకప్పు కూలిపోయింది. దీంతో వర్షాకాలం, ఎండాకాలంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.