ముషీరాబాద్: డ్రైనేజీ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బుధవారం బాలాజీ నగర్ లో డ్రైనేజీ లైన్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఠా జైసింహ, కార్యకర్తలు పాల్గొన్నారు.