నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బుధవారం బాలాజీ నగర్ లో డ్రైనేజీ లైన్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ముఠా జైసింహ, కార్యకర్తలు పాల్గొన్నారు.