కురుమ కులస్తులను బీసీ-బీ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర కురుమ సంఘం కార్యదర్శి అడికే మహేందర్ అన్నా రు. కురుమ సంఘం సీనియర్ నాయకులు అడికే రాజు ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కురుమ కులస్తులకు జీవనోపాధి గొర్రెలు, మేకలు మేపడం వృత్తిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ. సత్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు.