అఖిల భారత రజక సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జయశంకర్ జిల్లా కు చెందిన వైనాల లింగన్న రజక నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన చేసింది. లింగన్న మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి బాధ్యత అప్పజెప్పిన అనీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక హక్కుల కోసం పోరాటం చేస్తానని అన్నారు.