ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్: ఎల్బీనగర్ ఏసీపీ

59பார்த்தது
ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్: ఎల్బీనగర్ ఏసీపీ
ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అని సోమవారం ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం శ్రమించి విధి నిర్వహణలో అసువులు బాసారని అన్నారు. ప్రజ లందరూ సహకరించినప్పుడే శాంతిభద్రతను కాపాడేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసులలో భాగమే అని సూచించారు.

தொடர்புடைய செய்தி