పార్కులను శుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని బీఎన్ డ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. శ్రీపురంకాలనీ పార్కును కాలనీవాసులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులకు వచ్చే సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.