తెలంగాణ ఉద్యమకారుల తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎల్బీనగర్, అంబర్ పేట్, రాజేంద్రనగర్ ఇతర ప్రాంతాల నేతలు ఆదివారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమర్ ఖాన్ గూడ నాయకులు ఖరాడి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.