హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది: హైకోర్టు
హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేమని తేల్చి చెప్పింది. జీవో 99, హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ చట్టంలోని విశేషధికారాలను హైడ్రాకు కల్పిస్తూ పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.