భావోద్వేగానికి గురైనప్పుడు కన్నీళ్లు రావటం సహజం. తీవ్రమైన దుఃఖం నుంచి విపరీతమైన ఆనందం వరకు అనేక రకాల భావోద్వేగాలకు సహజ ప్రతిస్పందన కన్నీళ్లు. అయితే ఏడుపు.. ఒత్తిడి, మానసికంగా కలిగే నొప్పిని తగ్గిస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. నాడీవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కన్నీళ్లలోని లైసోజైమ్ అనే ద్రవం బ్యాక్టీరియాను నశింపచేసి, కళ్లను శుభ్రంగా ఉంచుతుంది. దీంతో కంటిచూపు మెరుగుపడుతుంది.