కోహెడలో నూతన మార్కెట్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుడు పి. ఉదయ్ కుమార్ తెలిపారు. కోహెడలో నిర్మించనున్న మార్కెట్ స్థలాన్ని నూతన పాలకవర్గం, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా అన్ని రకాల సదుపాయాలతో పాటు దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద మార్కెట్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.