హైదరాబాద్: ఉద్యోగుల సమస్యల సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిన
హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీవో భవన్లో మంగళవారం తెలంగాణ ఉద్యోగ, అధికారుల, కార్మిక, పెన్షనర్ల ఐకాస సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. నవంబర్ 2న భారీ ర్యాలీల ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లకు తమ సమస్యలపై వినతిపత్రం అందిస్తామని తెలియజేశారు. ప్రభుత్వం దిగిరాక పోతే తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.