బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో మాజీమంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు సూచించారని ఫిర్యాదు దారులు తెలిపారు.