విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రంలో కస్తూరి గాంధీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి భోజనం, చదువు అందిస్తున్నారని పరిశీలించారు. మెరుగైన విద్య ఆహారం అందించాలన్నారు.