శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్సి రాధ బాలకృష్ణ ఇంట్లో ఇటివల చోరీ జరిగిన నేపథ్యంలో మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంగళవారం నాడు వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంభ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందులో ఉన్న సుమారు రెండు కిలోల బంగారం, 80 తులాలు వెండి ఆభరణాలు, రెండున్నర లక్షల రూపాయల నగదు చోరీకి గురైందని రాధ బాలక్రిష్ణలు సబితా ఇంద్రారెడ్డికి వివరించారు.