సీఎం రేవంత్రెడ్డికు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి లగచర్ల కేసులో జైలులో ఉన్న 16 మందితో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ములాఖత్ అయ్యారు. మొహీనాబాద్ పోలీసులు అడ్డుకున్న తీరును విమర్శిస్తూ ఎంపీ మాట్లాడుతూ.. సీఎం సోదరుడు అక్కడికి వెళ్లవచ్చు కానీ తనను వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.