తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024, విజయవంతంగా సాగుతోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయినట్లు సర్వే నిర్వహిస్తున్న అధికారులు తెలియజేశారు. మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోగల పలు గ్రామాలలో కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.