కేటీఆర్ ను హెచ్చరించిన మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్
మాజీ మంత్రి కేటీఆర్ తాట తీస్తామని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు హెచ్చరించారు. గురువారం గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలంతా కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ మహిళల మీద ట్రాల్స్ చేయడం తగదని, వెంటనే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం మహిళల మీద చేస్తున్న వ్యాఖ్యలను కేటీఆర్ మానుకోవాలని సునీతారావు హెచ్చరించారు.