రాష్ట్రంలో చేపడుతున్న కులగణన కార్యక్రమాన్ని సమీక్షించేందుకు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ లో జరిగే రాహుల్ గాంధీ సభకు పాతబస్తీ కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లారు. కులగణనపై మేధావులు, పౌరహక్కులు, విద్యార్థి కుల సంఘాల నేతలతో కుల గణనకు సంబంధించి సలహాలు, సూచనలు స్వీకరించడానికి విచ్చేసిన రాహుల్ గాంధీకి బేగంపేట్ ఎయిర్ పోర్టులో పాతబస్తీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.