రాష్ట్ర గవర్నర్ జీష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, ఎంపీలు బుధవారం భేటి అయ్యారు. రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే తీరును గవర్నర్ కు వివరించారు. ఈ సర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలువనిందని వివరించారు. 2025లో చేపట్టే దేశవ్యాప్త జనగనణలో ఈ కుల సర్వేను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.