భాజపా ఎంపీ కె లక్ష్మణ్ ఆదివారం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ చేస్తామని, రైతు బందు పెంచి ఇస్తామని అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న రేవంత్ రెడ్డి, ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఎపుడు ఇచ్చారో, పరీక్షలు ఎపుడు నిర్వహించారో తెలపాలన్నారు.