హైదరాబాద్: నిధుల కేటాయింపులపై మంత్రి కొండా సురేఖ హర్షం

64பார்த்தது
హైదరాబాద్: నిధుల కేటాయింపులపై మంత్రి కొండా సురేఖ హర్షం
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లను కేటాయించడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్ పోర్టు ఏర్పాటు తన రాజకీయ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు పట్టువదలకుండా శ్రమించి అనుకున్నది సాధించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி