పుష్ప-3 గురించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అప్‌డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సుకుమార్ పుష్ప-3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని, స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని తెలిపారు. పుష్ప-2 భారీ హిట్ అందుకోవడంతో పుష్ప-3కి కూడా అదే స్థాయిలో కష్టపడతానన్నారు. అలాగే ‘పుష్ప-2’ కోసం క్రియేట్ చేసిన కొన్ని ట్యూన్స్ వినియోగించలేకపోయామని, వాటికి ‘పుష్ప-3’లో అవకాశం ఉండొచ్చని తెలిపారు.